ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విజయవాడలో పవర్ స్టార్ పవన్ను కలిశారు. ఆపై సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో నిన్నటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవసరంలేదని అభిప్రాయపడ్డారు.
సోము వీర్రాజు మాట్లాడుతూ, విశాఖలో నిర్వహించిన వైసీపీ గర్జన ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమం అని ఆరోపించారు. అయితే ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర అసహనానికి గురై జనసేనపై కుట్రకు తెరదీశారని వివరించారు.
తాము డ్యూటీ చేస్తున్నామని పోలీసులు చెప్పారని, అందుకు తనకేమీ అభ్యంతరంలేదని చెప్పానని, జనసేన చేస్తున్నది పోలీసులతో యుద్ధం కాదని స్పష్టం చేశానని వివరించారు. తాను బస చేసిన హోటల్లో అర్ధరాత్రి నుంచి వేకువజామున నాలుగున్నర, ఐదు గంటల వరకు ఒక ఫ్లోర్ మొత్తం గందరగోళం సృష్టించారు.
అరుపులు, కేకలు, బాదడాలు, చప్పుళ్లతో భయానక వాతావరణం సృష్టించారు. పాపం, విదేశాల నుంచి వచ్చినవారు కూడా నోవోటెల్ హోటల్లో ఉన్నారు. టూరిజం పరంగా ఎంత తప్పుడు సంకేతాలు వెళతాయి? వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని పవన్ ఫైర్ అయ్యారు.