మరోవైపు ఇదే పేరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు వైయస్ఆర్సీపీ పేరుపై ఇచ్చిన షోకాజ్ నోటీసుపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీ పేరుతో తనకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ ప్రశ్నించారు. ఇదే అంశాన్ని ఆయన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లారు.
తాజాగా, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకటనాగేశ్వరావు, ముదునూరి ప్రసాద్ రాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.