అబ్బే... జగన్ నడుస్తున్న దారి నాకు ఏమీ నచ్చడంలేదు, వైకాపాకు గుడ్‌బై చెప్పిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే

వరుణ్

బుధవారం, 24 జులై 2024 (16:38 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి షాకులు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తేరుకోలేని షాకిచ్చారు. పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, గుంటూరు లోక్‌సభ వైకాపా ఇన్‌చార్జ్ కిలారి రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు. 
 
'వైకాపా కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తుంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోలేదు. మండలిలో ప్రతిపక్ష నేత విషయంలో కనీసం చర్చించలేదు. మండలిలో చైర్మన్ అన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా తనను నిలబెట్టారు. కొందరు మానసికంగా కుంగదీశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీ నడుపుతున్నారు. వైకాపాలో నేను కొనసాగలేను' అని రోశయ్య స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు