రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

సెల్వి

శుక్రవారం, 28 జూన్ 2024 (21:45 IST)
Ali
సరదాగా అలీ కార్యక్రమంలో నటుడు శివాజీ ఇచ్చిన అడ్వైజ్‌ను కమెడియన్ అలీ సీరియస్‌గా తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకే దూరంగా ఉంటానంటూ సంచలన ప్రకటన చేశారు అలీ. రాజకీయాలకు దూరంగా వుండమని, రాజకీయాలొద్దని అలీకి శివాజీ చెప్పారు. శివాజీ ఇచ్చిన సూచన మేరకు వైసీపీకి నటుడు అలీ రాజీనామా చేశారు. 
 
కామన్ మ్యాన్ లాగా ఐదేళ్లకు ఒకసారి వెళ్లి ఓటు వేసి వస్తానని.. ఇకపై రాజకీయాలకే దూరంగా వుంటానని వీడియో ద్వారా తెలియజేశారు. తనకు అన్నం పెట్టింది తెలుగు పరిశ్రమ అని అలీ చెప్పుకొచ్చారు. 45 ఏళ్లుగా.. 6 భాషల్లో.. 1200 పైచిలుకు సినిమాల్లో నటించినట్లు తెలిపారు.

తనకు సాయం చేసే గుణం ఉందని.. దానికి రాజకీయ బలం తోడైతే.. మరింత సేవ చేయవచ్చనే ఉద్దేశంతోనే పాలిటిక్స్‌లోకి వచ్చినట్లు అలీ వెల్లడించారు. తాను ఉన్న పార్టీల్లో ఉన్న నాయకులను పొగిడాను తప్పితే.. ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులను ఎప్పుడూ తిట్టలేదని క్లారిటీ ఇచ్చారు.
 
ఇకపోతే.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ. ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2022లో అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగారు. 
Ali
 
2024 ఎన్నికల్లో అయినా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని భావించారు అలీ. కానీ ఆ ఆశ నెరవేరలేదు. 2024 ఎన్నికల సందర్భంగా అలీ ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో.. అలీ వైసీపీని వీడటం చర్చనీయాంశమైంది.

వైఎస్సార్‌సీపీకి నటుడు అలీ రాజీనామా.

ఇకపై రాజకీయాలకు స్వస్తి పలికిన అలీ pic.twitter.com/Qv761Y13ga

— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు