క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది సేకరించిన నమూనాలకు ఐడీ నంబర్లు వేసి, సీల్ చేయడంలో అధికారులు పొరపాట్లు చేశారని, కనీసం మూత కూడా పెట్టకుండానే ప్రయోగశాలలకు పంపుతున్నారని ఆయన మండిపడ్డారు. దీంతో టెస్టింగ్ కేంద్రాల్లో నమూనాలన్నీ పక్కన పడేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఒంగోలుతో పాటు పొదిలి అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన, అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షింబోమని హెచ్చరించారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది కరోనా టెస్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు.