ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, పవర్ సెక్టార్ రంగాలు ఓడరేవుల అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆ దిశగా నిధులు సమీకరణకు బ్యాంకర్ల సహకారం అవసరమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం కోసం బోధన ఆసుపత్రులతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగం కొత్త వైద్య కళాశాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
ఆరోగ్య రంగానికి 2 వేల కోట్ల రూపాయలు రుణ సదుపాయం అవసరం కాగలదని పెద్ద మనస్సుతో ఇందుకు సహకరించాలని యూబిఐ ఎండి రాజ్ కిరణ్ రాయ్ ను సిఎస్ కోరారు. అదేవిధంగా 2023 నాటికి రాష్ట్రంలో 3 ఫంక్షనల్ గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడులో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్దికి నిధులు సమీకరణ చేపట్టడం జరిగిందన్నారు.