ట్రెయిలర్ చూసిన ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. దర్శకుడు లీలాధర్ రావు కోలా, హీరో జె.పి నవీన్‌లకు ఈ చిత్రం విజయాన్ని అందించాలని ఆశాభావం వ్యక్తమైంది. అదే సందర్భంలో, లీలాధర్ రావు తండ్రి జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన శివానంద స్మరణ కార్యక్రమంలో వీరిద్దరినీ సన్మానించారు.
ఈ కార్యక్రమానికి కందుల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిటూషన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, చిత్ర యూనిట్ సభ్యులతో సహా సుమారు 6,000 మంది హాజరయ్యారు. త్వరలో ఈ ఏ ఎల్ సీ సీ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాని ఏప్రిల్ 25 వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇతర చిత్ర తారగణం: దనుష్ దేవర పోలి; శ్రీకర్ కొమాండూరి; కమల్; డి శ్రీనివాసులు రెడ్డి; శామ్ నాయక్; నేత్ర, రాజీవ్ కోలార్, ఇ. రామేశ్వరం, హరినాధ రాజు, తదితరులు.