ఏపీ సీఎం జగన్ బెయిల్ పొంది పదేళ్లు.. ఆర్ఆర్ఆర్ సెటైర్లు

శనివారం, 23 సెప్టెంబరు 2023 (19:48 IST)
RRR
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పొంది పదేళ్లయిన సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కేక్ కట్ చేసి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 23వ తేదీ మా పార్టీ వాళ్లు సంబరాలు చేసుకునే రోజు అంటూ సెటైర్లు విసిరారు. 
 
రూ.43 వేల కోట్ల అవినీతి కేసులో బెయిల్‌పై రావడం, ఆ బెయిల్‌ను విజయవంతంగా కొనసాగించడం జగన్‌కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. 
 
కోర్టుకు హాజరు కావాల్సిన పనిలేదని జగన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారని వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఇంత ఘనత వహించిన జగన్‌కు శుభాకాంక్షలు అంటూ రఘురామ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు