తిరుపతిలో రామ్ గోపాల్‌ వర్మపై పోలీసులకు ఫిర్యాదు

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:44 IST)
తిరుపతి ఎం.ఆర్‌.పల్లి పోలీస్టేషన్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మపై ఉపాధ్యాయ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులను కించపరిచేలా వర్మ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 
 
వెంటనే వర్మ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం వర్మ ట్విటర్‌లో ఉపాధ్యాయులకు ఏమీ తెలియదని ట్వీట్‌ చేశాడు. దాంతో పాటు ఉపాధ్యాయులను కించపరిచే విధంగా మందు బాటిల్‌ను ఉంచాడు. దీనిపై ఉపాధ్యాయ సంఘం మండిపడుతోంది. 

వెబ్దునియా పై చదవండి