కాగా, కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్ళిన బాలక్రిష్ణ ఆ సాయంత్రం ఢిల్లీలో ప్రముఖ రాజకీయనాయకులు, ప్రముఖుల సమక్షంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలక్రిష్ణ, భార్య వసుంధర దేవి, కుమార్తె తేజ్వసిని, ఆమె భర్త ఎం.పి. భరత్, తెలుగు దేశం మంత్రులు ఆ వీడియోలో కనిపించారు. ఈ సందర్భంగా బాలక్రిష్ణ మాట్లాడుతూ, నాన్నగారు ఏ సినిమా చేసినా ఆయన కనిపించేవారు కాదు. పాత్రే కనిపించింది. బొబ్బిలిసింహం కానీ మరే సినిమా కానీ ఆయన పాత్రలో లీనమైపోయేవారు. అలా నేను ఆయన్నుంచి పుణికి పుచ్చుకున్నాను అన్నారు.
తెలుగుదేశం కేంద్ర మంత్రి నాయుడు మాట్లాడుతూ, నేను ఎక్కువగా సినిమా చూడను. కానీ మీరు నటించిన మంగమ్మ శపథం, మంగమ్మగారి మనవడు వంటి సినిమాలు చూశాను. మీ డెడికేషన్ కు హాట్సాప్. తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది నటులున్నారు. ఇప్పుడు కొత్తతరం కూడా ముందుకుసాగుతున్నారు. రేపు వచ్చే తరానికి కూడా మీరు మార్గదర్శకం అవుతున్నారని.. ప్రశంసించారు. దానితో బాలక్రిష్ణ మహదానందంతో తన తండ్రి గురించి, తన గురించి పలు విషయాలను మాట్లాడారు.