Nabha Natesh Pahalgam shooting
పహాల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన అహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహాల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది.