ప్రపంచస్థాయి విద్యతో పోటీ పడేలా రాయచోటి ప్రాంత విద్యార్థులు రాణించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరైన సందర్భంగా బుధవారం రాయచోటి బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఎస్ టి యు మరియు ఆర్ యు టి ఎ ఉర్దూ ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నాడు - నేడు కార్యక్రమం ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు.పేద,మద్య తరగతి విద్యార్థులు సైతం ఆధునిక, సాంకేతికత, ఇంగ్లీష్ మీడియం తో కూడిన ప్రమాణాలుతో విద్యను అందించే చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు.ఇప్పటికే రాయచోటి ప్రాంతంలో పలు విద్యాలయాలు ఏర్పాటయ్యాయన్నారు.
బాలికల విద్యా ఉన్నతి కోసం స్థానిక పెద్దలు, ప్రజల విన్నపం మేరకు రాయచోటిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేసామన్నారు.ఈ కళాశాలలో నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా వుండే కోర్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బాలికలందరూ మంచి చదువులు చదువుకుని ప్రయోజకులైతే రాష్ట్రం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
రాయచోటి ప్రాంత అభివృద్ధి విషయంలో మనం కన్న కలలు సాకారం అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ గత ఏడాది ఇదే మాసంలో రాయచోటిలోనే చేసిన శంఖుస్థాపనల పనులు శరవేగంగా జరుగుచున్నాయన్నారు. రాయచోటిలో అభివృద్ధితో పాటు పరిశ్రమల స్థాపన, ఐ టి పై దృష్టి సారిస్తున్నట్లు ప్రజల హర్ష ద్వానాల మధ్య ఆయన చెప్పారు.
ఉర్దూ పాఠశాలలోని ఖాళీల పోస్టుల భర్తీ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా...
రాష్ట్రంలో అప్ గ్రేడ్ అయిన 220 ఉర్దూ మీడియం పాఠశాలలు, కళాశాలలో 660 పోస్టుల ఖాళీల భర్తీ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ ,ఎస్టియూ పి.సనావుల్లా మరియు రూటా నాయకులు సబాతుర్ రెహమాన్, లు సదరు ఖాళీలను భర్తీ చేయాలని సభలో శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. యూనియన్ల వినతిపై స్పందించిన శ్రీకాంత్ రెడ్డి ఖాలీల భర్తీ కి తప్పక సహకరిస్తామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధిలో చీఫ్ విప్ కృషి అభినందనీయం: ఎం ఎల్ సి జకియా ఖానం.
రాయచోటి నియోజకవర్గ అభివృద్ధిలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషి అభినందనీయమని ఎం ఎల్ సి జకియా ఖానం అన్నారు.సన్మాన సభలో జకియా ఖానం మాట్లాడుతూ అభివృద్ధిపై ఒక ప్రణాళికా బద్దంగా శ్రీకాంత్ రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు.
చీఫ్ విప్ కు ఘన సన్మానం...
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ని ఆర్ యు టి ఏ, ఎస్ టి యు తదితర ఉపాధ్యాయ సంఘాలు, మైనారిటీ సంఘాలు, పెద్దలు తదితర పట్టణ ప్రముఖులు, బాలికల జూనియర్ కళాశాల అధ్యాపక బృందం తదితరులు దుస్సాలువలతో, గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ సి జకియా ఖానం ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టియూ , రూటా నాయకులు హషీమ్, మున్వర్ బాషా , అసద్ , మహమ్మద్ అలి, అంజద్ బాషా, సునీర్, ఇర్షాద్, మైనారిటీ నాయకులు హబీబుల్లా ఖాన్, సర్ ఖాజి సర్ఫుద్దీన్, అలినవాజ్, అల్ జమియత్ కమిటీ సభ్యులు మహబూబ్ బాషా, అబ్దుల్ హాక్, దశరథ రామిరెడ్డి, అల్లాబకష్, ఫజులే హిలాహి, మదన్ మోహన్ రెడ్డి, బేబారి మహమ్మద్ ఖాన్, హారూన్, ఫయాజుర్ రెహమాన్, ఇమ్రాన్, జాకీర్, కొలిమి ఛాన్ బాషా, ఫయాజ్ అహమ్మద్, సుగవాసి విద్యాధర్, ఎస్ పి ఎస్ రిజ్వాన్, అల్తాఫ్,గువ్వల బుజ్జిబాబు,జిన్నా షరీఫ్,గంగిరెడ్డి, నాయక్, కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, షబ్బీర్,ఖళీళ్,నవరంగ్ నిస్సార్, తదితరులు పాల్గొన్నారు.