అమరావతిలో ఎందుకు పోటీ చేయలేదు... ఆర్కే ప్రశ్న... పవన్ సమాధానం?

ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (14:50 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పవన్ కల్యాణ్‌పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. అమరావతి రైతులకు సంబంధించి వైకాపాపై పవన్ నిప్పులు చెరిగిన వేళ.. పవన్‌ కళ్యాణ్‌కు నిజంగా రాజధానిపై ప్రేమ ఉంటే ఇక్కడ ఎందుకు పోటీ చేయలేదని రామకృష్ణారెడ్డి నిలదీశారు. కనీసం వారి పార్టీ అభ్యర్థినైనా ఎందుకు పోటీకి పెట్టలేదని ప్రశ్నించారు. 
 
లెప్ట్‌ పార్టీ అభ్యర్థి తరఫున ఎందుకు ప్రచారం చేయలేదన్నారు. నారా లోకేష్‌ గెలుపునకు తెరవెనుక పవన్‌ ప్రయత్నాలు ప్రజలకు తెలుసునని తెలిపారు. ఇవాళ రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తే జనం నమ్మరని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ రాజధాని పర్యటనపై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిప్పులు చెరిగారు.
 
చంద్రబాబు ప్యాకేజీ అందినప్పుడు ఒకలా.. అందినప్పుడు మరోలా మాట్లాడటం పవన్‌కు అలవాటు అయ్యిందన్నారు. జనసేన అధినేత ఇప్పటికీ టీడీపీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారనే విమర్శలకు ఆయన వైఖరే ఆస్కారం కల్పిస్తోంది. పవన్ రాజధాని ప్రాంతంలో పోటీ చేయకపోవడమే కాక.. ఆ ప్రాంతంలో పోటీ చేసిన కమ్యూనిస్టుల తరపున గట్టిగా పోరాడలేదనే విమర్శలు ఉన్నాయి. మరి వీటికి పవన్ ఏం సమాధానం చెబుతారో..?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు