ఈ కొత్త మార్పుతో, నామమాత్రపు దరఖాస్తు రుసుము చెల్లించి ప్రజలు తమ సొంత ట్రాక్టర్లు, బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా రవాణా చేయవచ్చు.
ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇసుక సోర్స్ పాయింట్ల నుండి ఫోటోలు వైరల్ కావడం ప్రారంభించడంతో ఏపీలో ఇసుక జాతర జరుగుతుందా అన్నట్లు వుంది పరిస్థితి. ఈ చిత్రాలలో, రీచ్‌ల నుండి ఇసుకను సేకరించడానికి పదుల లేదా వందల ట్రాక్టర్లు క్యూలో నిలబడటం చూడొచ్చు. కొత్త ఇసుక విధానాన్ని సామాన్య ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.