చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుపై ఏపీ సర్కారుకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

వరుణ్

సోమవారం, 29 జనవరి 2024 (12:50 IST)
ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ చుక్కెదురైంది. పైగా, ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కూడా అపెక్స్ కోర్టు నిరాకరించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా, 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అందువల్ల ఈ కేసు, బెయిల్ వ్యవహారంలో చంద్రబాబుకు సైతం నోటీసులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు