ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరపలేదు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరపడం లేదని, విచారణ తేదీని తర్వాత వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. దీనికి కారణం.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాల్సిన ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది మరో కేసు విచారణలో బిజీగా ఉన్నందున విచారణ చేపట్టలేదు.
జస్టిస్ బేలా త్రివేది 14వ నెంబరు కోర్టులో విచారణలో బిజీగా ఉన్న నేపథ్యంలో బుధవారం ఫైబర్ నెట్ కేసు విచారణను చేపట్టలేదు. చంద్రబాబు తరపున కేసును విచారించేందుకు సుప్రీంకోర్టుకు సిద్ధార్థ్ లుథ్రా వెళ్లారు. మరోవైపు, ఫైరబ్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోని అంశాలు 17ఏతో ముడిపడివున్నందున ఈ పిటిషన్‌పై విచారణను గతంలోనే సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెల్సిందే.
సంక్రాంతి సంబరాల కోసం ఆయన తన సొంత నియోజకవర్గానికి సుధీర్ఘకాలం తర్వాత ఆయన వచ్చారు. ఈ సందర్భంగా భీమవరం మండలం, రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాలు తర్వాత తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.