ఏడున్నర సంవత్సరాలైనా ఏపీ రాజధాని ఎక్కడో తెలీదు, మళ్లీ గందరగోళం: పవన్ కళ్యాణ్

సోమవారం, 22 నవంబరు 2021 (21:46 IST)
ఏపీ 3 రాజధానులు బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త రూపంతో వస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ విడిపోయి ఏడున్నర సంవత్సరాలైనా అసలు రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలోకి పాలకులు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 
ఆనాడు అసెంబ్లీలో రాష్ట్ర రాజధానిపై చర్చ జరిగినప్పుడు జగన్ మోహన్ రెడ్డి అంగీకరించి ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల త్యాగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందనీ, అలాంటి త్యాగం ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలకు పూర్తిగా న్యాయం జరగాలన్నా రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలన్నా రాష్ట్రానికి ఒకే రాజధాని వుండాలన్నారు. ఆ రాజధానిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలని జనసేన కోరుకుంటోందని చెప్పారు.

 
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి జనసేన సంపూర్ణ మద్దతు వుంటుందన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులను మార్చడం ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు