ఏ క్షణమైనా రాజధాని తరలింపు : మంత్రి బొత్స

సోమవారం, 29 మార్చి 2021 (09:21 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా, కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు ఏ క్షణమైనా తరలిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒప్పించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖపట్టణానికి తరలిస్తామని తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు తలపెట్టారని తెలిపారు. 
 
అంతేకాకుండా, త్వరలోనే 32 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, జడ్పీటీసీలు, ఎంపీటీలు, సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా, రాజమహేంద్రవరం పరిధిలోకి మరో పది గ్రామాలను విలీనం చేస్తామని, తద్వారా రాజమండ్రి హెరిటేజ్ సిటీగా మారుతుందని ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు