సినీ ప్రముఖులను కోట్లు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి పోలీస్ కస్టడీలో పలు విషయాలను వెల్లడించింది. మూడు రోజుల నార్సింగ్ పోలీసు కస్టడీలో వున్న శిల్పా చౌదరి.. పది కోట్ల రూపాయలకు పైగానే రాధికారెడ్డికి ఇచ్చినట్లు చెప్పినట్లు తెలిసింది. కానీ అందుకు తగిన ఆధారాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఆమె చేసిన మోసాలపై పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
ఇప్పటికే దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డి నుంచి శిల్ప రూ.7 కోట్లకుపైగా తీసుకుని మోసం చేసినట్టు ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడా డబ్బును వెనక్కి ఇచ్చేందుకు శిల్ప అంగీకరించింది. కాగా, మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు నేడు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.