ప్రముఖ మేగజైన్ ఎలీ ఇండియా తన జూలై ఎడిషన్ కవర్ పేజీపై బ్యూటిపుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ ను పబ్లిష్ చేసింది. తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో సౌత్ ఇండియన్ సినిమాలో నభా తనదైన ప్రత్యేకతను సంపాదించుకుందని ఎలీ ఇండియా మేగజైన్ కవర్ పేజీ స్టోరీలో పేర్కొంది. ఎలీ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ కావడం నభా నటేష్ కు దక్కిన మరో గౌరవంగా భావించవచ్చు. ఇటీవలే నభా 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' గా ఔట్ లుక్ అవార్డ్ గెల్చుకోవడం విశేషం.