పవన్‌ను సభలో పలకరించిన పాము..? జగన్ జేబులోంచి డబ్బు..?

శనివారం, 31 ఆగస్టు 2019 (18:45 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనలో వున్నారు. రెండో రోజు రాజధాని రైతులతో సమావేశమైన జనసేనాని.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని అమరావతిని తరలిస్తారనే వార్తలపై పవన్ రైతులతో సమావేశమై వారికి సంఘీభావం తెలిపారు.

రాజధాని ఎక్కడికి వెళ్లిపోదని, ఇక్కడే ఉంటుందన్నారు. తమ భవిష్యత్తు తరాలకోసం రాజధాని నిర్మాణానికి రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని పవన్ చెప్పారు. రాజధాని విషయంలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. 
 
అయితే పవన్ పాల్గొన్న సభలో పాము కూడా కనిపించి కలకలం రేపింది. జనసేన కార్యాలయంలో పవన్ సమావేశం నిర్వహిస్తుండగా ఓ పాము కలకలం సృష్టించింది.

పామును చూసిన వెంటనే అక్కడికి వచ్చిన రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళకు గురయ్యారు. వెంటనే దాన్ని గుర్తించి చంపేశారు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
అంతకుముందు.. రెండు రోజుల రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా తుళ్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

రాజధానికి అవసరమైన డబ్బు జగన్‌ తన జేబులోంచి తీసి ఇవ్వడం లేదని పవన్‌ అన్నారు. హైదరాబాద్‌కు ధీటుగా ఏపీ రాజధాని ఉండాలని ఆకాంక్షించారు.
 
రాజధాని విషయంలో మాజీ సీఎం చంద్రబాబు అనుసరించిన వైఖరి అపోహలకు దారితీసిందని ఆరోపించారు. వేల ఎకరాల సేకరణ వల్లే అవినీతి జరిగిందని అనుమానాలు వచ్చాయని ఆయన అన్నారు. రాజధానిగా అమరావతి ఉంటుందని తాను మాటిస్తున్నానని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు