అధర్మ మార్గంలో ధర్మాదాయ శాఖ : జనసేన నేత మహేష్

మంగళవారం, 20 ఆగస్టు 2019 (19:09 IST)
రాష్ట్రంలో ధర్మాదాయ శాఖ అధర్మ మార్గంలో ప్రయాణిస్తుంది జనసేన పార్టీ నేత మహేష్ ఆరోపించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, పారదర్శకంగా పాలన అందిస్తున్న దుర్గ గుడి ఈవోపై ప్రభుత్వం కక్ష కట్టటం దారుణమన్నారు. 
 
వచ్చే దసరాకి దోచుకోటానికే ఈవోపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. గత దసరాకి 6 నుండి 7 కోట్లు ఖర్చు అయితే ఈ దసరాకి 20 కోట్లు ఖర్చు చేసి దోచుకోవాలని మంత్రి వెల్లంపల్లి చూస్తున్నారని ఆరోపించారు. మంత్రికి అనుకూల వర్గాన్ని దుర్గగుడిలో పోస్టింగ్ వేసి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
సంవత్సరం తీరగకుండానే ఈవో కొటేశ్వరమ్మని బదిలీ చేయాటానికి కారణం మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పారదర్శకంగా పాలన చేస్తుంటే బదిలీ అనే బహుమానం మంత్రి ఇచ్చారన్నారు. దాతలు సహకారంతో  దుర్గ గుడిలో నిర్మాణాలు జరుగుతుంటే దాతల దగ్గర కూడా కమిషన్‌లు అడగటం సిగ్గు చేటన్నారు. 
 
అసంపూర్తిగా ఉన్న రాతి మండపం నిర్మాణంకి రూ. 7 కోట్లు బిల్స్ రిలీజ్ చేయాలని మంత్రి ఒత్తిడి తెచ్చారన్నారు. మంత్రి చెప్పిన మాటలు ఈవో వినటం లేదని, అందుకే ఈఓపై బదిలీ వేశారన్నారు. మంత్రి వెల్లంపల్లి చెప్పిన వారికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం వలనే ఈవోపై బదిలీ వేటు వేశారన్నారు. పారదర్శక పాలన అంటే ఇదేనా?? ముడుపులకు ఆశపడే మంత్రి ఈవోను మారుస్తున్నారు.. ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు