వచ్చేనెల నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ, ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు.
తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించ నున్నారు. ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు.
అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర ఇన్ చార్జీ మంత్రులు,మంత్రులు,జిల్లా కలెక్టర్లు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.