అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో జరిగిన నగర పాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. తద్వారా జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత టీడీపీ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 24 వార్డులకు జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 10 వార్డుల్లో అగ్రస్థానంలో నిలువగా.. కాంగ్రెస్ పార్టీకి ఆరు వార్డులు దక్కాయి.
ఇక తెలుగుదేశం పార్టీకి రెండు వార్డులు సొంతం కాగా, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు చెరో వార్డు చొప్పున గెలుచుకున్నాయి. ఇతర పార్టీలు నాలుగు స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఇక బీజేపీ 10 స్థానాల్లో గెలువగా, తెలుగుదేశం పార్టీకి ఇద్దరు సభ్యులు ఉండటంతో, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు సాయంతో నగర పాలక పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.