వైకాపా నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైకాపా నేతలు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడిలపై టీడీపీ అధికార ప్రతినిథి పట్టాభి ఫైర్ అయ్యారు. వీరిద్దరూ కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని దోచుకుని కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టుకు తరలిస్తున్నారని ఆరోపించారు. రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసి బియ్యాన్ని కొడాలి నాని, ద్వారంపూడిలు పక్కదారి పట్టిస్తూ పందికొక్కుల్లా తింటున్నారు.