Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

సెల్వి

గురువారం, 2 అక్టోబరు 2025 (19:29 IST)
2022లో విడుదలై భారీ విజయం సొంతం చేసుకుని, నేషనల్‌ అవార్దు దక్కించుకున్న కాంతారకు ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్‌ 1 రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయి భారీ విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా దసరా సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాంతారా చాప్టర్ 1. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతార చాప్టర్‌ 1 తెరకెక్కింది. 
 
ఈ చిత్రంపై పాజిటివ్ రివ్యూ, కామెంట్స్ వచ్చేశాయి. తాజాగా కాంతారాపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా తన రివ్యూను పోస్టు చేశారు. కాంతారా చాప్టర్ 1 టీమ్‌ను అభినందించారు. 
 
రిషబ్‌శెట్టి తన ఆలోచనలతో నటుడిగా, దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని వెండితెరపై చూపెట్టాడని.. ఆయన నమ్మకంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిన హోంబలే ఫిల్మ్స్‌, చిత్ర బృందానికి శుభాకాంక్షలు.. అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతార చాప్టర్‌ 1 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన తారక్‌ కాంతారను ఈ స్థాయిలో తెరకెక్కించడం రిషబ్‌కు మాత్రమే సాధ్యమని కొనియాడిన సంగతి తెలిసిందే. 
 
కాంతార చాప్టర్‌ 1 సినిమా రిలీజ్‌కు తర్వాత పలువురు సెలెబ్రిటీలు, అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1ను తెరపై చూసి.. షో ముగిశాక కన్నీళ్లు పెట్టుకున్నారు.

Rishab Shetty's wife not able to control her tears after the premiere of #KantaraChapter1.

Rishab already said in his interviews that he hardly spent time at home over the last 3 years, working hard on this project. He deserves big success!
pic.twitter.com/6taqYtmhev

— Siddarth Srinivas (@sidhuwrites) October 1, 2025
ఈ సినిమాను రిషబ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆ ఫలితాన్ని వెండితెరపై చూశాక ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అదేవిధంగా తారక్, రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఓ శివాలయాన్ని సందర్శించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను తారక్ ఫ్యాన్స్, రిషబ్ ఫ్యాన్స్ భారీగా షేర్ చేస్తున్నారు.

Top Indian celebrities who proudly flaunt their Dharma. #JrNTR#Rishabshetty #KantaraChapter1 @tarak9999 @shetty_rishab ❤️❤️pic.twitter.com/RZlp7K3dha

— Tony (@NMeklaNTR) October 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు