కొందరికి వయసు మీదపడుతున్న బుద్ధి మాత్రం మారడం లేదు. కుటుంబ పోషణ నిమిత్తం కుమారుడు విదేశాల్లో ఉంటే.. తమ వద్ద ఉన్న కోడలిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన ఓ మామ... ఆమెపై కన్నేసి.. పడక సుఖం పొందాలని పరితపించాడు. తనపట్ల మామ ప్రవర్తనను పసిగట్టిన ఆ మహిళ.. పెద్ద మనుషులకు వివరించి మందలించింది. అయినప్పటికీ 60 యేళ్ల వృద్ధుడి బుద్ధి మారలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి మండలం లింగాపూర్‌లో వెలుగులోకి వచ్చింది.