నా భార్యను తిట్టారు... అందుకే నేను బూతులు తిట్టా : నిజాన్ని అంగీకరించిన పోసాని

ఠాగూర్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:08 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆయనకు వివిధ రకాలైన వైద్య పరీక్షల తర్వాత శ్రీ అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు పోసాని నేరానికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా పోసాని న్యాయమూర్తి ఎదుట నిజాన్ని అంగీకరించారు. 
 
బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి రైల్వే కోడూరుకు తరలించారు. ఆ తర్వాత గురువారం రాత్రి రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ హాజరుపరిచారు. ఆ తర్వాత 9 గంటల నుంచి ఉదయం శుక్రవారం ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు ఇరు వర్గాల వాదోపవాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు ఆలరించిన న్యాయమూర్తి.. నిందితుడు పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. 
 
మరోవైపు, కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి ముందు పోసాని వాస్తవాలు అంగీకరించారు. తన భార్యను దూషించారని, అందుకే ఆ బాధతో తాను అలా మాట్లాడాల్సివచ్చిందన్నారు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని అంగీకరించారు. 
 
తన భార్యను దూషించిన దూషణలకు కట్ చేసి.. బాధతో తాను మాట్లాడిన మాటలను మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను దూషించిన వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారని పోసాని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు