అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉత్తరాదిలో ఆలయాల విస్తరణకు ఢిల్లీ సలహా మండలి కృషి చేస్తుందని చెప్పారు. ఢిల్లీ, కురుక్షేత్ర సహా పలుచోట్ల టీటీడీ కి ఆలయాలున్నాయని తెలిపారు. జమ్ములో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని, 18 నెలల్లో ఆలయ నిర్మాణణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
తిరుమలశ్రీవారి ప్రసాదాలు, నిత్యాన్నదానం తో పాటు టీటీడీ అవసరాలకు గో ఆధారితఉత్పత్తులను సేకరిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం ఢిల్లీ శ్రీవారి ఆలయంలో గోపూజ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు. పాల్గొన్నారు.