అనంతపురంలో సిగరెట్లు దోచుకెళ్లిన దొంగలు

సోమవారం, 5 ఏప్రియల్ 2021 (17:04 IST)
జిల్లాలో మండల కేంద్రమైన బత్తలపల్లిలో శనివారం రాత్రి రెండు ఇళ్లు, రెండు దుకాణాలు చోరీ జరిగింది. కదిరిరోడ్డులోని జాతీయరహదారికి అనుకోని ఉన్న రెండు ఇళ్లు, రెండు దుకాణాల్లో గుర్తుతెలియని దుండుగలు చోరీకి పాల్పడ్డారు.
 
బాధితుడు తెలిపిన వివరాల మేరకు కదిరి రోడ్డులోని నివాసం ఉంటున్న గోవర్దన మరో ఇంటిలో నిద్రిస్తుండగా దుండుగలు తాళం వేసిన ఇంటిని బద్దలుకొట్టి రూ.30 వేలు నగదు, 30 తులాల వెండి, 25 వేల విలువ చేసే సిగరెట్లు దోచుకెళ్లారు. 
 
ఆ ఇంటిపక్కన ఉన్న మరో ఇంటిలో రెండు బంగారు ఉంగరాలు, 18తులాల వెండి, మరో దుకాణంలో రూ.10వేల విలువ చేసే సిగరెట్లు, మరో కూల్‌డ్రింక్స్‌ దుకాణంలో నగదు లభ్యం కాకపోవడంతో కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
 
తెల్లవారజామున చూడగా ఇళ్లల్లో దొంగతనం జరిగిన విషయాన్ని చూసి లబోదిబోమన్నారు. 
నిత్యం వాహనాలు తిరిగే ప్రధాన రహదారిలో చోరి జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.   ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు