సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి తప్పించనున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెల కిషోర్‌బాబు, గనులు శాఖ మంత్రి పీతల సుజాత, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కొత్తగా మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మహ్మద్ జానీకి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.