అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

ఠాగూర్

ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (23:27 IST)
ఏదో అలా వచ్చాం.. ఇలా వెళ్ళిపోయామనే సన్నివేశాల్లో నటించడం కంటే అంటీ లేదా అమ్మ పాత్రల్లో నటిస్తానని ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ అంటున్నారు. తాజాగా జరిగిన ఓ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని తన మనసులోని మాటను వెల్లడించారు.  
 
కొన్ని రోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటికి సందేశం పంపించాను. ఆమె నటించిన ఓ సినిమాని ఉద్దేశించి అందులో రాసుకొచ్చాను. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుందని, ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయానని సందేశం పంపా. దానికి ఆమె వెంటనే స్పందించింది. అంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ రిప్లై ఇచ్చింది. 
 
నిజం చెప్పాలంటే ఆమె పంపిన మెసేజ్ నన్ను ఒకింత షాక్‌కు గురిచేసింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్టు అనిపిచింది. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ వర్క్ చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి. మనపై మనం నమ్మకం ఉంచినపుడే వర్క్ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతాం. దేనిని చులకనగా చూడకూడదు అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు