టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు తెలుగు తమ్ముళ్లు డుమ్మా కొడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశానికి రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. ఈ నెల 9వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.