విశ్వక్సేన్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైలా' వాలంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే స్ట్రయికింగ్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో దృష్టిని ఆకర్షించింది.