ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, బర్డ్, స్విమ్స్, సెంట్రల్ హాస్పిటల్ కు అవసరమయ్యే మందులు, పరికరాలు ఓకే విభాగం ద్వారా కొనుగోలు చేయడానికి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సెల్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
బర్డ్ ఆసుపత్రి పేషంట్ ఫ్రెండ్లీ ఆసుపత్రిగా ఉండాలనీ, హెల్ప్ డెస్క్లు, రిసెప్షన్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. రోగుల కోసం కొత్తగా నిర్మించిన గదులను వెంటనే ఉపయోగంలోకి తేవాలని చెప్పారు. కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని బలోపేతం చేయాలన్నారు.
అధునాతన పరికరాల కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. క్యాథ్, ల్యాబ్ మే 30వ తేదీకి ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలన్నారు. ఈనెలాఖరుకు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తి చేయాలని డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.