తిరుమలలోని అన్నదానం సత్రం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక చిన్నారి మరణించాడనే వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తోసిపుచ్చింది. అలాంటి వార్తలు అవాస్తవమని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 16 ఏళ్ల మంజునాథ్ చాలా సంవత్సరాలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 22న, తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రంలో భోజనం చేసిన తర్వాత, అతను అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.