విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద మృతులు వీరే

ఆదివారం, 9 ఆగస్టు 2020 (15:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ నగరంలో స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటరులో ఆదివారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదం కంప్యూటర్ గదిలో ఏర్పడిన విద్యుదాఘాతం వల్ల సంభవించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. 
 
అయితే, ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. ఇప్పటి వరకూ 10మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 50 మంది ఉన్నట్లు తెలియవచ్చింది. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్, కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
 
ఇదిలావుండగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను పరిశీలిస్తే, డోక్కు శివ బ్రహ్మయ్య (58), మచిలీపట్నం, పూర్ణ చంద్ర రావు మొవ్వ, సుంకర బాబు రావు (రిటైర్డ్ ఎస్సై), సింగ్ నగర్, మజ్జి గోపి (మచిలీపట్నం), సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు, వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి) కందుకూరు, వెంకట లక్ష్మి సువర్చలా దేవీ (కందుకూరు), ఎం. రమేష్ (విజయవాడ), పవన్ కిషన్ (కందుకూరు), అబ్రహం చర్చి ఫాదర్ (జగ్గయ్యపేట)తో పాటు మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సివుంది. 
 
కాగా ఈ పది మంది మృతదేహాల పోస్టుమార్టం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించున్నారు.  మరోవైపు, బెజవాడ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమాన్యాలపై బెజవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హోటల్, ఆసుపత్రి రెండింటిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు