ప్రత్యేక హోదా పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారనీ, పార్లమెంటులో ప్రకటించిన ఆ హామీని నెరవేర్చాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అడిగితే, ఆయనపై మాటలు దాడి చేయడం దారణమని సీపీఐ నాయకుడు రామకృష్ణ అన్నారు.
పవన్ కళ్యాణ్ అడిగిన దాంట్లో అసమంజసమేమైనా ఉన్నదా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అణచివేయాలని చూస్తే తాము చూస్తూ సహించబోమనీ, వెనుక మేమున్నామంటూ చెప్పారాయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.