వివరాల్లోకి వెళితే.. పెనమలూరుకు చెందిన శీలం రాజారత్నం, ప్రశాంతిలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2014లో వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే రాజారత్నం పెళ్లైన కొద్దిరోజుల నుంచి ప్రశాంతిని వేధించడం మొదలుపెట్టాడు.
రెండో కాన్పులో ప్రశాంతి జనవరి 28న ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆడపిల్లను కన్నావని, కట్నం తీసుకురావాలని, లేకపోతే పుట్టింటికి వెళ్లిపోమని వేధింపులను మరింత తీవ్రతరం చేశాడు.
ఆమె అరుపులకు పక్కగదిలో ఉన్న ప్రశాంతి తల్లి వచ్చిచూడగా విద్యుత్తు వైర్లు కనిపించాయి. అప్పటికే రాజారత్నం పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మామలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.