భర్త స్నేహితుడని ఇంట్లోకి రానిస్తే లైంగికంగా వేధించాడు..

గురువారం, 13 అక్టోబరు 2016 (11:20 IST)
భర్త స్నేహితుడేనని ఇంట్లోకి రానిస్తే వంకర బుద్ధిని చూపించాడు. స్నేహితుడి భార్యను లైంగికంగా వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ దంపతులు నివసిస్తున్నారు. అయితే భర్త స్నేహితుడని ఆ వివాహిత ఇంటికి తరచూ వచ్చిన యువకుడు ఆమెను లైంగికంగా వేధించాడు. 
 
భర్త ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు వారింటికెళ్లి ఆమెను వేధిస్తున్నాడు. భర్త స్నేహితుడే కదా అని ఇంట్లోకి రానిస్తే ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావని అనేక మార్లు హెచ్చరించినా.. ఆ యువకుడు వినకపోవడంతో ఇక లాభం లేదనుకుని భర్తతో ఆ వివాహిత అసలు విషయం చెప్పేసింది. దీంతో భార్యాభర్తలిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసును విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి