వైసీపీ గ్రామసింహాలు ఇలా అరవడం సహజమే అన్నారు. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు.. ఇవన్నీ సహజమే అని వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 2వ తేదీన పవన్ రెండు ప్రాంతాల్లో శ్రమదానం
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేస్తారు. ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల గురించి జనసేన పార్టీ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా ఉద్యమించిన సంగతి విదితమే.