అవినీతి డబ్బుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఏపీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టానుసారం కొంటున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా తెలిపారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అంతేగాకుండా రోజా సస్పెన్షన్పై డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారని రోజా ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ఎంతోమంది అమాయక మహిళలు తమ మాన ప్రాణాలు కోల్పోయారని ఎన్నో దౌర్జన్యాలకు గురయ్యారని కొంత మంది తమకు జరిగిన అన్యాయాలపై బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. ఓ వైపు అవినీతిరహిత పాలన అంటూనే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ బాబు ఇద్దరు ఏపీని అడ్డంగా దోచుకుంటున్నారని రోజా ధ్వజమెత్తారు.