తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పట్టణంలోని రాయల్ సర్కిల్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్కు వచ్చాడు. లోపలికి వెళ్లి, ఏటీఎం డిస్ప్లే, నంబర్ బోర్డు తదితరాలపై లాలా జలాన్ని ఊశాడు. దీన్ని గమనించిన కొందరు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్కు తీసుకుని వెళ్లి, వైద్యులతో పరీక్షలు జరిపించారు.
అతనికి జలుబు, దగ్గు ఉన్నాయని, 101 డిగ్రీల జ్వరంతో పాటు కరోనా లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయని వైద్యులు తేల్చారు. దీంతో వెంటనే ఏటీఎంను మూసివేసిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని, వైద్య చికిత్స తర్వాత విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.