అసెంబ్లీకి జగన్ వచ్చారు.. వెళ్లారు.. అటెండెన్స్ పడింది. మరో 3 నెలలు సభ్యత్వం సేఫ్!!

ఠాగూర్

సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (12:33 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజున వైకాపా అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభకు వచ్చారు. సభలోకి అడుగుపెట్టే ముందు అసెంబ్లీ హాజరుపట్టికలో వారు సంతకం చేశారు. అంటే సభకు వచ్చినట్టుగా హాజరు వేయించుకున్నారు. దీంతో మరో 60 రోజుల పాటు వారు సభకు రాకుండానే కాలం గడిపేయవచ్చు. 
 
సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు జగన్ తన పరివారంతో సభకు హాజరుకావడంతో మరో 60 రోజుల వరకు అటువైపు కన్నెత్తి చూడాల్సిన పరిస్థితి ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న భయంతోనే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సభకు వచ్చారని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, సభకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం 11 నిమిషాల్లోనే సభ నుంచి వాకౌట్ అయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగానే తన సభ్యులతో కలిసి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అది సాధ్యపడకపోవడంతో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు