ఫోన్ సిగ్నల్‌లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ విధానంలోనూ సరుకులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాలంటీర్ క్లస్టర్‌కు మ్యాపింగ్ కాని, కార్డులను కామన్ పూల్ కింద పరిగణించనున్నారు.. ఇక, కార్డుదారులు రాష్ట్రంలోని ఏ మొబైల్ వాహనం నుంచి అయినా సరుకులు పొందే అవకాశం కల్పిస్తోంది వైఎస్ జగన్ సర్కార్.
వాలంటీర్లు రిజిస్టర్ అయిన మ్యాపింగ్ కార్డులకు రేషన్ సరుకుల వాహనం ఎప్పుడు వస్తుందో ముందుగా మెసేజ్ పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మొబైల్ వాహనము అన్ని వీధులు కచ్చితంగా తిరిగేలా చూడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.. వేలిముద్రల అథంటిఫికేషన్ సమస్యకు ఫ్యూజన్ ఫింగర్ ప్రక్రియ, ఈ కేవైసీ ప్రక్రియ, వాలంటీర్ వేలిముద్రలతో సరుకులు జారీ చేసే అవకాశం కల్పిస్తోంది వైసీపీ ప్రభుత్వం.