సినిమావాళ్లకు రాజకీయాలు ఎందుకు? పవన్‌ కళ్యాణ్‌పై ముద్రగడ సెటైర్లు

వరుణ్

ఆదివారం, 24 మార్చి 2024 (19:12 IST)
ఇటీవల వైకాపాలో చేరిన కాపు పెద్దగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా వాళ్లకు ఈ రాజకీయాలు ఎందుకు అని సూటిగా ప్రశ్నించారు. త్వరలోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా జెండా ఎత్తేస్తాడని జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం తథ్యమని ఆయన అన్నారు. పైగా, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఓటమికి కృషి చేస్తానని స్పష్టంచేశారు.
 
ఆయన ఆదివారం మాట్లాడుతూ, సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి కొద్దికాలంలోనే జెండా ఎత్తేశారన్నారు. సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం పక్కా అని ముద్రగడ జోస్యం చెప్పారు. తనను చంద్రబాబు ఎంతో బాధపెట్టాడని, తన శత్రువైన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం తనకు ఏమాత్రం నచ్చలేదన్నారు. ఎన్నికల్లో పవన్, చంద్రబాబుల ఓటమికి కృషి చేస్తానని చెప్పాు. నా శత్రువుతో చేతులు కలిపిన వ్యక్తి నీతులు చెబితే నేను వినాలా? అని మండిపడ్డారు. 21 సీట్లకు సర్దుబాటు చేసుకున్న పవన్‌కు నేనెందుకు మద్దతు ఇవ్వాలని అని ముద్రగడ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు