కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో విభేదాలు సహజమే: ఉండవల్లి

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (14:51 IST)
FILE
కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో విభేదాలు సహజమేనని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే ఆ విభేదాలు చిన్నవేనని ఉండవల్లి శుక్రవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలున్నప్పటికీ, కలిసి పనిచేయాల్సి వస్తే కలిసిపోతామన్నారు.

మరోవైపు చేనేత శాఖ మంత్రి ప్రసాద్ కుమార్ కూడా పార్టీలో విభేదాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమన్నారు. అలాగే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో తనకు విభేదాలున్నాయని వచ్చిన వార్తలను ఖండించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వలనే తనకు మంత్రి పదవి లభించిందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి