సినిమా రంగంలో ప్రొడక్ట్ అమ్ముడుపోవాలంటే నిర్మాతదే బాధ్యత. దాని కోసం చాలా కసరత్తు చేయాల్సి వుంటుంది. ఒకప్పటికీ ఇప్పటికీ ప్రచారంలో చాలా మార్పు గోచరిస్తుంది. కాలానుగుణంగా ప్రచారాన్ని మార్చుకోవడం దర్శక నిర్మాతల నైజం. కానీ ఆ ప్రచారాన్ని తనదైనముద్ర వేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడు రాజమౌళి దిట్ట అనేది సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన తెలివితేటలు గడ్డెంలోనే వున్నాయా? అంటూ ఇటీవలే ఓ షూటింగ్ లో నిర్మాత పిచ్చాపాటీగా మాట్లాడుతూ సరదాగా కామెంట్ చేశారు.
RRR markting
ఒకప్పుడు సినిమాను మార్కెట్ చేయడానికి శేఖర్ కమ్ముల చేసిన వినూత్న ప్రచారం చాలా మందిని అప్పట్లో సందేహం కలిగించింది. రేడియో, మీడియా పార్టనర్లుగా వివిధ ప్రొడక్ట్ లను బేరీజు వేసుకుని చేసేవారు. అప్పటికీ రాజమౌళి పెద్దగా సినీమా రంగానికి తెలీదు. కానీ బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి మార్కెట్ ఎత్తుగడ అందరికీ అర్థమయిందనే చెప్పాలి.
bahubali kamik
సినిమాలో ప్రతీదీ వ్యాపారం చేయడంలో రాజమౌళి దిట్ట.. బాహుబలి సినిమాను పైసా ఖర్చులేకుండా తన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. యుద్ధంలో ఉపయోగించిన కత్తులు, కటారులు కూడా ప్రమోషన్ కు ఉపయోగించాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాలో లీకేజ్ విషయంలో మీడియాముందుకు వచ్చాడు మినహా అస్సలు సినిమాను ఆయన అంతా తన భుజాలపై మోసుకున్నాడు.
ఆ సినిమా విడుదలకుముందు పరిమిత మీడియాను పిలిచి ప్రభాస్ చేత ఇంటర్వూలు ఇవ్వడం పెద్ద రబస అయింది. ఇక తర్వాత సినిమాను రకరకాలుగా మార్కెట్ చేస్తూ ఆదాయం రాబట్టడం ఆయనకు తెలిసినట్లు ఎవరికీ తెలీదు అనేది బహిరంగ రహస్యమే. ఇంతకుముందు ప్రచారానికి పంపిణీదారులు, శాటిలైట్ అమ్మకాలు, ఓటీటీ వున్నాయి. కానీ పైకి ఎవరికీ కనిపించని మార్కెట్ చేయడం అనేది రాజమౌళి కళ్ళకు కనిపించినట్లుగా ఎవరికీ కనిపించదు.
బాహుబలి సినిమా విడుదలయ్యాక ప్రతీదీ మార్కెట్ చేసిన రాజమౌళి.. బళ్ళాలదేవ, బాహుబలి టీషర్ట్స్, కీ చెయిన్స్, పిల్లలు ఆడుకునే కార్లు, బైక్ లు ఇలా ఒక్కటికాదు మాగ్జిమం అన్నీ మార్కెట్ చేసి నిర్మాతలకు మంచిలాభాలు వచ్చేలా చేశాడు.
ఈ మార్కెట్ ఇండియా వరకే కాకుండా విదేశాలకు సైతం పాకింది. చైనా, జపాన్ తదితర దేశాల్లోనూ బాహుబలి ముద్ర కనిపించింది. విదేశీ ప్రాంతీయ భాసల్లో సైతం ఏదో రకంగా వస్తువు రూపంలో మార్కెట్ చేయడం విశేషం. ఇక తాజాగా బాహుబలి కామిక్స్ రైట్స్ ను కూడా అమ్ముకోవడం జరిగింది. బాహుబలి యానిమేషన్ అంటూ ఇప్పటికే ప్రచారం చేసిన రాజమౌళి దానిని ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా విడుదలచేయబోతున్నారు.
యానిమేషన్ పేరుతో కొత్త మార్కెట్ ను క్రియేట్ చేయడంతో ఆయన కళ్ళు, గడ్డెం కూడా వెరైటీగా ఆలోచిస్తుంటాయని ఓ నిర్మాత చలోక్తి విసరడం విశేషమని చెప్పాలి.
ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్. సినిమాలు కూడా పలు రకాలుగా మార్కెట్ చేశారు. అయితే ఇంత మార్కెట్ చేయాలంటే బ్రాండ్ వాల్యూ కావాలి. ఇలా ఏ దర్శకుడు, నిర్మాత, హీరో చేసినా వర్కవుట్ కాదు. ఆ దిశలో కొందరు ప్రయత్నించి చివరిలో విరమించుకున్న సందర్భాలున్నాయి.
ఇక తాజాగా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమా వేలకోట్లతో రూపొందుతోందని సమాచారం. మరి తగిన విధంగా ప్రతీదీ మార్కెట్ చేసుకుని ప్రతీ పైసా రాబట్టుకోవాలని చూస్తున్నట్లు సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. చెరకు నుంచి రసాన్ని తీయడం మామూలే. కానీ పిప్పి నుంచి కూడా రసాన్ని వెలికితీయడం రాజమౌళి లాంటి వారికే సాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.