జిరాక్స్ కాపీ తీసుకున్నాక "నిఖానామా" ఇస్తాం..!: ఖాజీ

FILE
షోయబ్ మాలిక్- సానియా మీర్జా వివాహానికి లైన్ క్లియర్ అయ్యింది. పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకోవాలంటే.. పాస్ పోర్ట్ కాపీ తప్పకుండా ఇవ్వాల్సిందేనని ఖాజీ స్పష్టం చేసింది. పాస్ పోర్ట్ లేకుండా సానియా వివాహం చెల్లదని చెప్పింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ఖాజీ చట్టం ప్రకారం డాక్యుమెంటేషన్ పద్ధతిలో నిఖా జరిపిస్తామని తెలిపింది. కానీ సానియా-షోయబ్‌ల నిఖానామాను మాత్రం వెంటనే వారికి అందజేయమని స్పష్టం చేసింది. షోయబ్ మాలిక్ పాస్ పోర్ట్ జిరాక్స్ కాపీలు అందిన తర్వాతనే నిఖానామాను ఇస్తామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఖాజీ మహ్మద్ ఖాదర్ స్పష్టం చేశారు. దీంతో సానియా మీర్జా-షోయబ్ మాలిక్ వివాహానికి మార్గం సుగుమమైంది.

ఇకపోతే... శుక్రవారం సాయంత్రం జరిగే సానియా మీర్జా-షోయబ్ మాలిక్‌ల వివాహ వేడుకకు బంధువులు, సన్నిహితులు సానియా ఇంటికి చేరుకున్నారు. షోయబ్ మాలిక్ తరపున అతని కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువర్గం పాకిస్థాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా.. ఈ నెల 15వ తేదీన షోయబ్ మాలిక్- సానియా మీర్జాల వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి