స్విమ్మింగ్ పూల్‌లో జలయోగా ప్రదర్శన

Sridhar Cholleti

సోమవారం, 9 జూన్ 2008 (20:26 IST)
WD
నేలపై చేసే యోగా ఎంతో కష్టతరమైనదిగా మనకు తెలుసు. యోగ నిపుణులు లేనిదే క్లిష్టమైన ఆసనాలను వేయటం దుర్లభం. అయితే నీటిలో యోగాసనం వేయాలంటే... అస్సలు సాధ్యం కాదంటారు కదూ... అయితే స్విమ్మింగ్‌పూల్‌లో ఎంచక్కా జలయోగా వేసి చూపరులను ఆశ్చర్యాన్ని కల్గించాడో వ్యక్తి.

వివరాలలోకి వెళితే.... వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం ముగ్దుంపురం గ్రామానికి చెందిన ములక అయిలయ్య లిమ్కా బుక్ అవార్డుకోసం వరంగల్ లోని స్విమ్మింగ్‌ పూల్‌లో జలయోగ ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనకు వరంగల్ జడ్‌పీ ఛైర్‌పర్సన్ లకావత్ ధన్వంతరి ముఖ్య అతిథిగానూ, నగర మేయర్ ఇ. స్వర్ణ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి